"మనతెలుగు" - సూర్య

తెలుగు భాష లిపికి నావంతు సహకార ప్రయత్నం ఈ "మనతెలుగు". Yahoo Messenger 8.1 ద్వారా గానీ, Googletalk ద్వారా గానీ,
తెలుగులో చాటింగ్ చేయడానికి వీలుగా తయారు చేసిన అప్లికేషన్ ఇది. ఈ టూల్ ఉపయోగించి మీరు తెలుగుని unicode లో వ్రాయగలుగుతారు.
తెలుగు వ్రాయడం మీరు పూర్తిగా off-line లోనే చేయగలుగుతారు. అందరూ తేలికగా తెలుగు వ్రాసి, కంప్యుటర్లలో తెలుగు లిపి వ్యాప్తికి తోడ్పడగలరని మనవి.
మీ సూచనలు, సలహాలు అభిలషణీయం.
కావలసినవి: XP ఆపైన Operating System (unicode characters కోసం), yahoo messenger 8.1 లేదా GoogleTalk Beta,
Internet Explorer.
ఆంగ్లంలో 26 అక్షరాలు ఉంటే, తెలుగులో 56 అక్షరాలు ఉన్నాయి. అందుకని తెలుగుని ఆంగ్లంలో వ్రాయాలంటే capital letters వాడక తప్పదు. కావున తెలుగు 
Transliteration "case-sensitive". పొరపాటు లేకుండా అందరూ సరిగా అర్దం చేసుకోవాలంటే, కొద్దిగా కష్టపడి, మనకు తెలిసిన సామాన్యమైన english 
phonetic spelling లో ఆంగ్లం లో వ్రాసినచో, ఈ "మనతెలుగు",మన ప్రియమైన తెలుగులో తర్జుమాజేయును.
మధ్యలో మీరు కొన్ని ఆంగ్ల పదములను ఆంగ్లములోనే వుంచాలి అన్న, apostropheతో(') ఆ పదాన్ని మొదలు పెట్టి, మీరు వ్రాయగోరిన ఆంగ్లము పూర్తి అయిన 
తరువాత, మళ్ళీ apostropheతో ముగిస్తే, ఆ రెండు apostropheల మధ్య పదాలని తర్జుమా బడకుండా ఆంగ్లములోనే ఉంటాయి.
ఒకవేళ english sentence లో apostrophe వాడవలసిన అవసరం వస్తే, అక్కడ దయచేసి Grave Accent character(`) ని వాడండి,
ఈ character, keyboardలో, tab button పైన ఉంటుంది.
ఎంతో చరిత్ర కలిగిన తెలుగు బాష, ఈ "ప్రపంచీకరణ(globalization)" నేపద్యములో, అత్యవసరమైన ఆంగ్లబాష వలన, లిపిని మర్చిపోయి, లిపిలేని 
"తెగల బాష"గా మారిపోయే ప్రమాదము ఎంతో దూరములో లేదు. "మనతెలుగు" భాష లిపిని సజీవముగా ఉంచవలసిన బాధ్యత మనందరిది. కావున కొద్దిగా శ్రమతీసుకొని 
ముచ్చటైన "మనతెలుగు" భాషలో ముచ్చటించే ప్రయత్నం చేయండి. మీరూ చెయ్యండి, మీ స్నేహితులు,బంధువులతోనూ చేయించండి!
"మనతెలుగు" వాడే విధానము:
ఎవరితోనన్నా Yahoo IM గానీ GoogleTalk Chat window గానీ open చేసిన తరువాత, ఈ application open చెయ్యండి. Yahoo, Google ఏది అయితే 
అది select చేసుకోండి. ఆ తరువాత "మనతెలుగు" windowలోని క్రింద textbox లో, మీరు chat చెయ్యాలనుకున్న తెలుగు సంభాషణని, 
english script లో మనకు తెలిసిన సాధారణమైన spellingతో ఈ దిగువున చెప్పిన విధముగా type చెయ్యండి.(ప్రస్తుతానికి ఈ ప్రోగ్రాం ని, 
ఒక్కరితో chat చేసేటప్పుడు మాత్రమే వాడండి.)
type చేసిన తరువాత enter నొక్కినా లేక 'send' button నొక్కినా automaticగా, మీ message వెళ్ళిపోతుంది! 
ఈ Transliteration application కి, 500 characters limitation ఉంది.
అచ్చులు :
అ-a   ఆ-A (or) aa   ఇ-i   ఈ-ee (or) I   ఉ-u   ఊ-oo (or) U

ఋ-Ru  ౠ-RU   ఎ-e   ఏ-E   ఐ-ai   ఒ-o   ఓ-O   ఔ-ou

అం-aM   అః-aH
హల్లులు:
క-ka   ఖ-kha   గ-ga   ఘ-gha 

చ-cha   ఛ-Cha   జ-ja   ఝ-jha   ఙ్ఞ-Gna

ట-Ta   ఠ-T`a (or) Tha   డ-Da   ఢ-D`a (or) Dha   ణ-Na

త-ta   థ-tha   ద-da  ధ-dha   న-na

ప-pa   ఫ-pha (or) fa   బ-ba   భ-bha   మ-ma

య-ya  ర-ra  ల-la  వ-v (or) w  శ-Sa  స-sa  ష-sha  హ-ha  ళ-La  క్ష-ksha  ఱ-R`a (or) Rha

గుడింతం:

క్-k  క-ka  కా-kA (or) kaa  కి-ki  కీ-kee (or) kI  కు-ku  కూ-koo (or) kU  కృ-kRu (or) kRi
కౄ-kRU  కె-ke  కే-kE  కై-kai  కొ-ko  కో-kO  కౌ-kou  కం-kaM  కః-kaH

వత్తులకి, ఏ శబ్దానికి ఆ అక్షరం రాస్తే సరిపోతుంది.
కొన్ని ఉదాహరణలు:
అమ్మ-amma  నాన్న-nAnna (or) naanna

తెలుగు-telugu

ఆంధ్రప్రదేశ్- AMdhrapradES (or even) AndhrapradESh

ఇండియా-inDiyA (or even) inDiA

విష్ణువు-vishNuvu  నారాయణుడు-nArAyaNuDu 

వేంకటేశ్వరుడు-vEnkaTESwaruDu  శ్రీనివాసుడు-SrInivAsuDu

ఓం నమః శివాయః-OM namaH SivAyaH  బ్రహ్మ-brahma

రాముడు-rAmuDu  కృష్ణుడు-kRishNuDu (or) kRushNuDu

లక్ష్మి-lakshmi  గౌరి-gouri  సరస్వతి-saraswati

సాయిబాబా-sAyibAbA (or even) sAIbAbA

సూర్యుడు-sUryuDu or sooryuDu

కంత-kanta  కథ-katha  కంటే-kanTE  కంఠం-kanT`aM (or) kanThaM

బాదు-bAdu బాధ-bAdha బాడుగ-bADuga ఢాం ఢాం-D`AM (or) DhAM

కృతఙ్ఞత-kRitaGnata or kRutaGnata  కృతఘ్నుడు-kRutaghnuDu  అగ్ని-agni మేఘం-mEghaM

మధ్యానం-madhyAnaM పద్యాలు-padyAlu

పౌర్ణమి-pourNami  పైత్యం-paityaM పోకిరి-pOkiri  పొట్లకాయ-poTlakAya

సుఖఃదుఖాఃలు-sukhaHdukhAHlu  ఖడ్గం-khaDgam
ఎందుకు-enduku  ఎలా-elA  ఏమిటి-Emiti  ఏంటి-EnTi ఎంత-enta
కత్తి-katti  కట్టి-kaTTi కోత-kOta  కోట-kOTa  కొద్ది-koddi  కడ్డి-kaDDi
వెళ్ళు-veLLu  పెళ్ళి-peLLi  నిరాశ-nirASa  శత్రువు-Satruvu అణువు-aNuvu  అనువు-anuvu


ఆంగ్ల పదాలు, ఊరిపేర్లు, వాడుకలో ఉన్న english spelling కాకుండా, english పెద్దగా రాని ఒక తెలుగువాడు ఎలా phoneTic గా కూడబలుక్కొని,
రాస్తాడో అలా రాయండి.కొద్దిగా వింతగా ఉన్నా తప్పదు! మీకు చూస్తానికి ఇబ్బందిగా ఉన్నా అవతలి వాళ్ళకి చక్కటి వాడుకలో ఉన్న తెలుగులోనే అగుపిస్తాయి.
spelling కి మరీ ఇబ్బంది పడితే, ఆ పదాన్ని single quote ల మధ్యపెట్టి, వాడుకలో ఉన్న english spelling రాయండి. అవతల వారికి అది ఆంగ్లములోనే
వెళుతుంది. single quote ని close చెయ్యటం మర్చిపోకండి, మర్చిపోతే single quote మొదలు అయిన దగ్గర నుంచి మొత్తం english లోనే ఉంటది
Transliteration జరుగకుండా.
బస్-bas  టికెట్-TikeT  సర్కస్-sarkas  సినిమా-sinimA  రోడ్-rOD  బకెట్-bakeT
ఫ్రెండ్-frenD  గర్ల్-garl  హాయ్-hay కప్-kap టెలిఫోన్-TeliphOn  ఎయిర్ పోర్ట్-eyir pOrT
మ్యూజిక్-myUjik  హౌ ఆర్ యు-hou Ar yu ఫైన్-fain ఓకే-OkE  ఎస్-es  ఎన్-en  ఆటో-ATO
బ్యూటిఫుల్-byUTiful బ్యాట్-byAT ప్రెసిడెంట్-presiDenT సైట్-saiT మినిష్టర్-minishTar
బాంబ్-bAMb  టైమ్-Taim  మొబైల్-mobail  క్లబ్-klab గేమ్-gEm  జెమ్-jem  అరెస్ట్-aresT  కరెంట్-karenT

హైదరాబాద్-haidarAbAd or hYdarAbAd  బెంగుళురు-benguLuru న్యూఢిల్లీ-nyUD`illee or nyUDhillee
అమెరికా-amerikA or ameriCA  ఇంగ్లండ్-inglanD  రష్యా-rashyA  లండన్-lanDan
తాజ్‌మహల్, కిస్‌మిస్ లాంటి పదాలు తాజ్ కి, మహల్ కి gap రాకుండా రాయాలంటే "_"(underscore) వాడండి. 
అది వాడక పోతే, "తాజ్మహల్", కిస్మిస్" అవుతుంది.
ఉదాహరణ కి:
తాజ్‌మహల్ - tAj_mahal    కిస్‌మిస్ - kis_mis
కొసరు:
Telugu.xla - Microsoft Excel Add-in

ఇది Excel లో బాగా ప్రవేశం ఉన్నవారికి మాత్రమే! ఇది Telugu Function(). ఇది మీరు మీ Microsoft Excel Add-ins path లో install చేసుకొంటే,
Excel లో "=Telugu(String/Cell)" అని Formula రాసుకోవచ్చు. ఈ Tool డేటా ని, unicode తెలుగు లో మార్చుకుంటానికి, బాగా ఉపయోగపడుతుంది.
కాకపోతే ఈ function use చేసిన Excel file ఇతరులకి share చేసుకునేటప్పుడు, జాగ్రత్త పడండి, ఎందుకంటే, వాళ్ళ దగ్గర ఈ Add-in లేకపోవడం వలన,
వాళ్ళకి Excel File open అయ్యేటప్పుడు Error మెసేజ్ వస్తుంది. Telugu() function use చేసిన file ని, ఎవరితోనన్నా share చేసుకునేటప్పుడు,
ఆ Worksheet ని Copy చేసి, Paste Special లో, only values మాత్రమే paste చేసి, Telugu() లేకుండా చూసుకోండి.

ఇది మనతెలుగు వారి కోసం ఇప్పటివరకు నా కృషి. అందరూ ఉపయోగించుకొని, తెలుగు లిపి ని కంప్యూటర్లలో బాగా వాడుక లోకి తీసుకువస్తే నా కృషి ఫలిస్తుంది.
మీరు వాడటమే కాకుండా, ఇతర తెలుగు వారిని కూడా, తెలుగు వాడుటకు ప్రోత్సహించండి.
మీకు నా ప్రయత్నం నచ్చినా, ఏదేని సలహాలు ఇవ్వవలెనన్నా, సందేహాలు తీర్చుకోవలెనన్నా, నా ఈ-మెయిల్ అడ్రస్ suryaguduru@gmail.com
...ఇట్లు భవదీయుడు - సూర్య
జై తెలుగు జై జై తెలుగు